Wednesday, July 17, 2013

 పని లేని వాళ్ళు 

ఔను , వీళ్ళకి పని ఏమి ఉండదు 
స్వార్ధ చింతన తెలియదు 
సంపాదించాలనీ ఆలోచించారు 
కాని వీరు ఏ నాడు ఖాళీ కాదు 
ప్రతివిషయం వీళ్ళనే స్పందించేలా చేస్తుంది 
ఉపద్రవమైన,రాక్షసత్వమ్  ఐనా
సమస్య సామాజికం ఐనా
వీరినే కృంగదీస్తుంది 
నోటికి అందించడానికి ఆహరం లేకున్నా 
కవిత్వం ఆశువుగా తన్నకోస్తుంది ఆకలిమంటలా 
కాలు కదప లేని స్థితి కలిగినా 
సమస్యల యుద్దానికి సై  అంటారు 
దైవమా ... ఏంటి? ఈ వింత ప్రపంచంలోకి 
గ్రహాంతర వాసుల్లా  వాళ్ళని పంపించావు 
ఈ సమాజంలో వారి స్థానం ఏది ?
కవి సామ్రాజ్యపు మహారాజులా ?
మనసునే  కాటేసిన ముష్టి వాళ్లా ?
కాని ఏది ఏమైన... చరిత్రకు అందని కవిరాజులేందరో 
చరిత్రల కాగితాల మద్య నలిగి పోయారు 
కారణం ఆకలేనా ?మానసిక వ్యధా ...?

                               నల్ల సాయి రెడ్డి 
                               wait4urmsg.saireddy@gmail.com